డిసెంబర్ 3న తెలంగాణ ప్రజల తేటతెల్లం అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పదేళ్ల తెలంగాణ బాధలు తొలగిపోతాయి. ఓటమి ఖాయమని తెలిసినప్పుడే కేసీఆర్ తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారని. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణకు చైతన్యం వచ్చిందని కామారెడ్డి ప్రజలు నిరూపించారని రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3కి ప్రత్యేక స్థానం. శ్రీకాంతాచారి అదే రోజు తుది శ్వాస విడిచారు. శ్రీకాంతాచారి ఘటనతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేశారు. డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతమై ప్రజల తెలంగాణ ఆవిర్భావమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో తెలంగాణ ప్రజల చైతన్యంపై తనకు పూర్తి విశ్వాసం.
Our Citizen Reporter from Telangana

SANJEEV RAJESHAM BHANDARI