క్షేత్రస్థాయీలో పర్యటించి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అనువైన ప్రణాళికను మున్సిపల్ అధికారులకు, ఆఫ్కాన్స్ ఇంజనీర్లకు వివరించిన జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,
తిరుపతి నగర వాసులకు అర్ టి సి బస్టాండ్ పూర్ణకుంభం కూడలి వద్ద ట్రాఫిక్ కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో పూర్ణకుంభం కూడలిని సిగ్నల్ ఫ్రీ సర్కిల్ గా రూపాంతరం చేయుటకు మున్సిపల్ అధికారులు, ఆఫ్కాన్స్ ఇంజనీర్లతో కలిసి కార్యసాధనపై జిల్లా ఎస్పీ గారికి చర్చించారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు.. వారు రూపొందించిన ప్రణాళికను పరిశీలించి కొన్ని మార్పులను తెలియజేస్తూ, ప్రజల ట్రాఫిక్ సమస్య తీరేందుకు అనువైన సూచనలు చేశారు.
పూర్ణకుంభం కుడలికి చేరుకునే నలువైపుల నుండి వచ్చే వాహనదారులకు "ఫ్రీ యూటర్న్" ఉండేలాగా మార్పులు చేయాలన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు సులువుగా బస్ స్టేషన్ లోపలికి వెళ్ళుటకు, లోపలి నుండి గమ్యస్థానాలవైపు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జాం కాకుండా ఉండేలాగా ప్రణాళికను సరిదిద్దాలని మున్సిపల్ అధికారులు, ఆఫ్కాన్స్ ఇంజనీర్లకు జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శాంతి భద్రత కులశేఖర్, డీఎస్పీలు గిరిధర ఎస్బి, సురేంద్ర రెడ్డి తిరుపతి, నరసప్ప ట్రాఫిక్, ఈస్ట్ సీఐ మహేశ్వర రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐలు, నగరపాలక సంస్థ ఇంజనీర్లు, ఆర్టీసీ అధికారులు మరియు ఆఫ్కాన్స్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Our Citizen Reporter - Telangana
Mr. Bharath Reddy