రాష్ట్ర డి.జి.పి. కె. రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు ఈ రోజు ది.13.12.2023 వ తేదిన ఎన్.టి.ఆర్.జిల్లా, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రాస్ సిమెంట్ లిమిటెడ్ ప్యాక్టరీ క్యాంపస్ లోని ఎంప్లాయిస్ ట్రైనింగ్ సెంటర్ నందు పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారు, డి.సి.పి.లు విశాల్ గున్ని ఐ.పి.ఎస్.గారు, అజిత వేజెండ్ల ఐ.పి.ఎస్.గారు, శ్రీ మోకా సత్తిబాబు గార్లు మరియు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
సమీక్షా సమావేశంలో ఎన్.టి.ఆర్. పోలీస్ కమీషనరేట్ పరిధిలో కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, చెడు నడత కలిగిన వారిపై నగర బహిష్కరణలు, అలవాటు పడిన నేరస్తులపై పి.డి. యాక్ట్ లు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలగు అంశాలపై మరియు ఎన్.టి.ఆర్. పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అన్న విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా దొంగతనం కేసులు, కోట్లట కేసులు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరుగు నేరాలు ఘననీయంగా తగ్గినాయి అని, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా అధిక సంఖ్యలో శిక్షలు పడినాయని గుర్తించి నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియుఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖ సమర్ధవంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని తెలియచేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగులో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందిస్తామని తెలియచేశారు.
మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు:-గతం లో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసు శాఖలో అమలు చేస్తున్న కన్విక్షన్ టేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుంది. మహిళలు, చిన్న పిల్లలకు సంబందించి నమోదైన కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిని అత్యంత ముఖ్యమైన కేసులను కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా ఎస్పీ, డిఎస్పీ స్థాయి. అధికారుల స్వీయ పర్యవేక్షణలో డే టూ డే షెడ్యూల్ ద్వారా కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై క్రమం తప్పకుండ సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా కేసు యొక్క ట్రైల్ సమయాన్ని ఘననీయంగా తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే తప్పు చేసిన నేరస్తులకు జీవిత ఖైదు అంతకంటే ఎక్కువ శిక్షలు పడేవిధంగా చేయడం, అంతేకాకుండా తప్పు చేసిన ఏ ఒక్క నేరస్థుడు చట్టం నుండి తప్పించుకోకుండా చేయడం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ముఖ్య ఉద్దేశం.
కన్విక్షన్ టేస్డ్ పోలీసింగ్ విధానంలో విచారణలు చేపట్టిన అనంతరం రాష్త్రంలో మహిళలు మరియు చిన్నపిల్లలపై నమోదయిన కేసుల్లో గతంలో కేవలం నామమాత్రంగా మాత్రమే కన్విక్షన్ శాతం, కానీ ఇప్పుడు నమోదైన కేసుల్లో 66 శాతం పైగా కేసుల్లో నిందితులపై నేరాలు నిరూపించబడి వారికి న్యాయస్థానాలు శిక్షలు విధించడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి గారి నిరంతర పర్యవేక్షణలో మరియు ఇతర జిల్లాల ఉన్నతాధికారులు కోర్టులో విచారణలను వేగవంతం చేయడానికి నిరంతరం చేసిన కృషి ఫలితంగానే ఈ సత్ఫలితాలను సాధించగలిగింది మన పోలీస్ శాఖ.
కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్:
కన్విక్షన్ బేస్డ్ పోలింగ్ విధానాన్ని గత సంవత్సరం (2022) నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము. ఈ విధానం ద్వారా నేరాల తీవ్రత ఆధారంగా గుర్తించిన కేసుల్లో విచారణ పూర్తయింది. మహిళలపై నేరాలు, పోక్సో కేసులు మరియు ఇతర తీవ్రమయిన నేరాలకు సంబంధించిన కేసులను పైలట్ ప్రాతిపదికన గుర్తించి అత్యంత పకడ్బందీగా కేసు విచారణ చర్యలు చేపట్టడం జరిగింది. ఈ విధానం ద్వారా ఎక్కువ కేసులలో శిక్షలు పడినాయి, దీనివలన నేరస్తులలో భయం ఏర్పడి నేరాలు తగ్గుముఖం పట్టినాయి.
సైబర్ క్రైమ్ స్పెషల్ వింగ్ :
సైబర్ క్రైమ్ నేరాలు తీవ్రమైన నీరాలు కాకుండా, సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ కోసం 130 మందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన ఎక్కువ. సైబర్ కేసులు చేదించడం జరిగింది. ఎవరైనా సోషల్ మీడియా లో అబ్యూస్ పోస్ట్ లు పెట్టెవారిపై కేసులు నమోదు చేయడం, ఎవరిపైన కేసులు కట్టామో అన్న విషయాలను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా చాలా వరకు అటువంటి నేరాలు తగ్గినాయి.
నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు:–
ఆంధ్రప్రదేశ్ పోలీసులు, గ్రామీణ మహిళా పోలీసులు, వార్డు మహిళా పోలీసులు అందరూ కలిసి కట్టుగా గ్రామాలలో, వార్డులలో తిరుగుతూ ప్రజల యొక్క భూ సమస్యలు, ఇంటి సమస్యలు, కుటుంబ కలహాలు, అసాంఘిక నేరస్తుల కదలిక మరియు ప్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. ఇందువలన ఇటీవల గ్రామాలలో గొడవలు/ దోమ్మి, కుటుంబ కలహాలు లాంటి కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. నేరాల నిరోదించడానికి గస్తీని ముమ్మరం చేశాము.
దిశ మొబైల్ యాప్ ప్రభావం:-
రాష్ట్రం లో మహిళా రక్షణే బాధ్యతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గారు ఆవిష్కరించిన DISHA APP కు మహిళలతో పాటు రాష్ట్రం లోని ప్రతి ఒక్కరి నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. మహిళలు, విద్యార్థినిలకు అవగాహన కల్పించేందుకు నిరంతరంగా ప్రత్యేక చర్యలను తీసుకోవడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యాప్ డౌన్లోడ్ కోసం ప్రణాళికా బద్దంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు:
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయోగాలు చేస్తూ బ్లాక్ స్పాట్ లను, ఏ సమయంలో జరుగుతున్నాయి అన్న విషయాలను గుర్తించి, ఆర్టీఓ/ సంబధిత రోడ్డు ఇంజనీరింగ్ సిబ్బందితో నిత్యం జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు నిరంతర వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్, ప్రత్యేక అవగాహన సదస్సులు, ట్రాపిక్ ఎన్ ఫోర్స్ మెంట్ ను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను ఘననీయంగా అదుపు చేయడం జరిగింది.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు:-
నిషేదిత మారక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఇద్దరు డీఐజీ అధికారులను నియమంచడం తో పాటు నిరంతర పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోని గంజాయి పంటలను గుర్తించి వాటిని ద్వంసం చేయడం వలన తనిఖీలలో ఎక్కడా అధిక మొత్తంలో గంజాయి లభించడం లేదు. రాష్ట్రంలోని నలుమూలలఎక్కడ కూడా డ్రగ్స్ అనే పదానికి ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేబడుతూ డ్రగ్స్ పై దృష్టిని సారించాము.
పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు:-
ప్రత్యేక కార్యక్రమలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు గంజాయి సాగు, రవాణా పట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ వారిలో అవగాహన కల్పించడంతో పాటు గంజాయి సాగు మరియు రవాణా కు పాల్పడుతున్న వారిపైన కేసులు నమోదు చేయడం, పాత నేరస్తులను గుర్తించి వారిపైన PD ACT ప్రయోగించడం జరుగుతుంది. రాష్ట్రాన్ని DRUGS FREE STATE గా తయారు చేయుచున్నాము అని తెలియజేశారు.
అదేవిధంగా సిబ్బందితో మాట్లాడుతూ
నగరంలో క్రమం తప్పకుండా ఫుట్ పెట్రోలింగ్, పెట్రోలింగ్, బీట్స్ సంఖ్యను పెంచి, అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కౌన్సిలింగ్ లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ వాటి సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.
గంజాయి కేసులలో కూడా నిర్దేశిత సమయానికి చార్జ్ షీట్ వేయాలని ఆదేశించారు.
సిబ్బంది అందరు తమ విధులలో మెరుగైన పనితీరు చూపించాలని ఆదేశించారు.
మహిళా సంబంధిత కేసులలో ఎటువంటి అలసత్వం లేకుండా దర్యాప్తు చేయాలని మరియు ఎక్కడా మహిళలపై ఈవ్ టీజింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.
స్టేషన్ కు తీసుకు వచ్చే ముద్దాయిలతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ పరంగా బ్లాక్ స్పాట్ లను గుర్తిస్తూ తగు చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని,
బ్లేడ్ బ్యాచ్, గంజాయిసేవించే మరియు అమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెంచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., డి.సి.పి.లు విశాల్ గున్ని ఐ.పి.ఎస్. అజిత వేజెండ్ల ఐ.పి.ఎస్. గారు, శ్రీ మోకా సత్తిబాబు , ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
Mr. Bharath Reddy