50 లక్షల విలువచేసే 40 ఎర్రచందనం దుంగలతో సహా నగదు, మినీ లారీ, రెండు కార్లు స్వాధీనం.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అమావాస్య రెడ్డి కండ్రిగ గ్రామానికి సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్సు గోడౌన్లో నిలువ ఉంచిన ఎర్రచందనం దుంగలను అపహరించిన స్మగ్లర్ ముఠాను మంగళవారం దాసుకుప్పం బస్ స్టాప్ వద్ద స్థానిక పోలీసు అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.ఇందుకు సంబంధించి 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు 50 లక్షల రూపాయలు విలువచేసే 40 ఎర్రచందనం దుంగలుతో సహా 18,100 రూపాయలు నగదు, మినీ లారీ,రెండు కార్లు,14 మొబైల్ ఫోన్లు,సీసీ కెమెరాల డివిఆర్ బాక్స్, కత్తి, గుడ్డతో తయారుచేసిన గ్లౌజులు,20 అడుగుల నూలుతాడు,స్టార్లెక్ పెయింటింగ్ డబ్బా తదితర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.బుధవారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సిఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో పుత్తూరు డి.ఎస్.పి శ్రీనివాస రావు అధ్యక్షతన,స్థానిక ఫారెస్ట్ రేంజర్ జయ ప్రసాదరావు సమక్షంలో మీడియా ముందు ఎర్రచందనం దొంగలను,స్వాధీనం చేసుకున్న వాహనాలను,వస్తువులను ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా పుత్తూరు డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తమారి కుప్పం పంచాయతీ అమావాస్ రెడ్డి కండ్రిగ సమీపంలో తమిళనాడు రామచంద్రన్ కి చెందిన మామిడి తోటలో ఎర్రచందనం నిల్వకు సంబంధించి లైసెన్సుడు గూడౌన్ ఉందన్నారు. ఈ నేపథంలో డిసెంబర్ 17వ తేదీ రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు మామిడి తోటలోకి ప్రవేశించి కాపలా దారులుగా ఉన్న అరకయ్య,ఆనందయ్య, చెల్లమ్మ తదితరులను కత్తితో చంపుతానని బెదిరించి వారిని తాళ్లతో బంధించి ఎర్రచందనం గూడౌన్లోకి ప్రవేశించి 50 లక్షల రూపాయలు విలువచేసే రెండున్నర టన్నుల 45ఎర్రచందనం దుంగలు మినీ లారీలో తరలించుకుని వెళ్ళినట్టు మామిడి తోట యజమాని రామచంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.దీనిపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు సిఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో సత్యవేడు,వరదయ్యపాలెం ఎస్ఐలు శ్రీకాంత్ రెడ్డి,నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 19వ తేదీన దాసుకుప్పం బస్ స్టాప్ వద్ద వాహనాల తనిఖీలలో ఎర్రచందనం దొంగలు పట్టు పడ్డట్టు ఆయన పేర్కొన్నారు.ఈ కేసులో 16 మంది నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు.ఇందులో చెన్నై నేర విభాగంలో పనిచేస్తున్న చెన్నై థౌసండ్ లైట్స్కు చెందిన చంద్రశేఖర్(40), అలాగే తిరుచిరాపల్లి జిల్లా కేకే నగర్ కు చెందిన తిరుచ్చి డిఆర్ఎం ఆఫీసు సంబంధించి సూపర్డెంట్ నాగరాజన్(57) ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.మిగిలిన వారు తమిళనాడు నెల్వేలికు చెందిన శాంత కుమార్(48),తిరునల్వేలి జిల్లా కదిరేసన్(29), క్రిష్ణగిరి జిల్లా సుండే కుప్పం చెందిన శేఖర్(44), చిన్నారసు(30), తిరునల్వేలి జిల్లా సురేష్(32), సేలం జిల్లా అత్తూరు తాలూకా చెందిన సెల్వం(42),సెల్వరాజ్(36),కళ్లకుూర్చి జిల్లా శివ(31) సేలం జిల్లా చంద్రన్(38) సత్య రాజ్(26) అన్నాదొరై(33) రాజేంద్రన్(35) చిన్న తంబి(52) చెన్నై తిరువత్తూరుకు చెందిన జువనైల్ తదితరులు ఉన్నట్టు ఆయన వివరించారు.అయితే ఈ కేసు కు సంబంధించి పరార్లో ఉన్న చెన్నైకి చెందిన వెంకటాచలం,నెల్వేలి చెందిన మురుగేషన్, సేలం జిల్లాకు చెందిన మూర్తి తదితర ముగ్గురు నిందితులను కూడా అతి త్వరలో పట్టుకుంటామన్నారు.కాగా ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి,ఎస్సై శ్రీకాంత్ రెడ్డి,వరదయ్యపాలెం ఎస్సై,నాగార్జున రెడ్డి లను ఈ సందర్భంగా పుత్తూరు డిఎస్పి శ్రీనివాసరావు అభినందించారు.ఈ కార్యక్రమంలో నాగలాపురం ఎస్ఐ ఓబయ్య,స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
Mr. Bharath Reddy