జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్తూ ….జగిత్యాలలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ప్రజల పక్షాన నిలబడే భోగ శ్రావణికి అన్ని వర్గాలు మద్దతు పలుకుతున్నాయి. బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఉన్నాయి. మరోవైపు కాషాయ శ్రేణులు కూడా భోగ శ్రావణిని గెలిపించుకోవాలనే ఉత్సాహంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అటు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా…..వారికి ఎళ్లవేళలా అండగా నిలుస్తానని శ్రావణి హామీ ఇస్తున్నారు. తనకు ఓసారి అవకాశం కల్పిస్తే…నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేస్తున్నారు.
Our Citizen Reporter from Telangana

SANJEEV RAJESHAM BHANDARI