పదిహేను రోజుల్లో 117 మంది ఆకతాయిలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్. బాలికలను,మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉపా విశ్వనాథ్ గారు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు మరియు బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను మహిళలను వెంబడిస్తూ వేదించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు.
రాచకొండ కమిషనర్ శ్రీ డి.ఎస్. చౌహాన్, ఐపిఎస్ గారి ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, పి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 117 మందిని (మేజర్స్-47, మైనర్స్ -70) షీ టీమ్స్ వారు అరెస్టు చేసినారు. వారికి ఎల్బి నగర్ CP camp office (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు నందు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ (NGO). వారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గత నెల నవంబర్ 16 నుండి 30 వరకు 135 పిర్యాదులు అందినాయని. ఉమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ డిసీసీ టి. ఉపా విశ్వనాధ్ గారు తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన ఫిర్యాదులలో ఫోన్ల ద్వారా వేదించినవి – 24, WhatsApp కాల్స్ & messages ద్వారా వేదించినవి. -30, social media apps ద్వారా వేదించినవి-18, నేరుగా వేదించినవి 63. వాటిలో క్రిమినల్ కేసులు-04, పెట్టి కేసులు – 47, మరియు 68 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది..
ముఖ్యమైన కేసులు కొన్ని….
వెంటాడి వేధిస్తున్న మీడియా వ్యక్తి అరెస్టు:
ఎల్బి నగర్ లో నివాసముంటున్న మహిళా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తి / నిందితుడు. గత ఏడు సంవత్సరాలుగా ఆమెను శరీరకంగా, మానసికంగా ‘ప్రేమ పేరుతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. బాదితురాలు ఇట్టి విషయాన్ని అతని తల్లితండ్రులకు తెలియచేసింది. అప్పటినుండి కొద్దిరోజులు బాగానే ఉన్న నిందితుడు, తిరిగి వేధీచడం ప్రారంభించాడు. అదే విషయాన్ని ఎవరికైనాఅవగాహన కార్యక్రమం:
ఈ నెల నవంబర్ 16 నుండి 30 వరకు షీ టీమ్స్ రాచకొండ 47 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 8275 మందికి మహిళా చట్టాలు, వారి యొక్క హక్కులు మరియు నేరాల గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది.
మెట్రో-రైల్ డెకాయ్ ఆపరేషన్….
రాచకొండ పీ టీమ్స్ మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్సు నిర్వహించి, మహిళా కంపార్మెంట్లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న (05) మందిని పట్టుకుని మెట్రో స్టేషన్ అధికారుల ద్వారా ఫైన్ వేయించడం. జరిగింది.
డెకాయ్ ఆపరేషన్..
పీటీమ్ కుషాయిగూడ, కుషాయిగూడ ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రోడ్డు వెలుతున్న మహిళను, ఆడపిల్లలను వేధీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న 22 మంది మీద పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం మరియు మల్కాజ్ గిరి ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మహిళను, ఆడపిల్లలను వేదిస్తు ఇబ్బందులకు గురిచేస్తున్న పోకిరిలను 37 మంది అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది.
ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన మరియు సామాజిక మాద్యమాల ద్వారా దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే SHE Teams ని, Rachakonda Whatsapp నెంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంతాల వారిగా Bhongir area- 8712662598, ||Choutuppal area – 8712662599, Ibrahimpatnam area -8712662600, Kushaiguda area – 8712662601, LB Nagar area -8712662602, Malkajgiri area -8712662603 Vanasthalipuram area-8712662604 నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు. మరియు
ఈ కార్యక్రమంలో మహిళ రక్షణ విభాగం డి.సి.పి టి. ఉపా విశ్వనాధ్, ACP వెంకటేశం, ఇన్ స్పెక్టర్ పి.పరశురాం, అడ్మిన్ ఎస్ఐ రాజు మరియు షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్స్ శాంతిప్రియ, రమ్యా. శ్యామల గౌరి పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
Mr. Bharath Reddy