ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ ఈరోజు ఏలూరు అమీనా పేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెక్టర్ పోలీస్ అధికారులతో సమావేశమును నిర్వహించినారు
ఈ సమావేశం నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా సెక్టార్ పోలీస్ అధికారులు నిర్వహించవలసిన విధులను గురించి తెలియ చేస్తూ,
సెక్టర్ పోలీసు అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ ప్రదేశాల యొక్క నైతిక స్వరూపాలను గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని,
ప్రజలు వారి యొక్క ఓటు హక్కును నిర్భయముగా నిష్పక్షపాతముగా వినియోగించుకునేలాగా చూసే బాధ్యత పోలీసు అధికారులపై ఉన్నదని,
సెక్టర్ పోలీసు అధికారులు ఎన్నికలు జరిగేందుకు నిర్ణయించిన పోలింగ్ బూతులను పరిశీలన చేసి అక్కడ పోలింగ్ సక్రమంగా నిర్వహించడానికి కావలసిన వసతులు ఉన్నవే లేనిది అనే విషయాలపై గమనించి ఉన్నత అధికారులకు తెలియచేయాలని,
సెక్టర్ పోలీసు అధికారులు ముందుగా ఆ ప్రాంతాలలో నివసిస్తున్న రౌడీ షీటర్లు వారి యొక్క జీవన విధానం గురించి పరిశీలన చేయాలని వారిపై నిఘా ఉంచాలని,
సెక్టర్ పోలీసు అధికారులు వారు విధిని నిర్వహించే ప్రాంతాలలో గతంలో ఎలక్షన్ సందర్భంలో ఏమైనా కేసులు నమోదు అవినీతి విషయం దాంట్లో ఉన్న ముద్దాయిలు పై ఉన్న కేసులను పరిశీలన చేసి వారి నడవడికపై నిఘా ఉంచాలని,
సిబ్బందికి నియమించిన సెక్టర్ ప్రాంతాలలో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశాలను గురించి గానీ లేదా బెదిరింపులు గాని జరిగే అవకాశాలను గురించి ముందుగా సమాచారాన్ని సేకరించాలని,
సెక్టర్ పోలీసు అధికారులకు ఇచ్చిన ఉద్యోగ నిర్వహణలో అలసత్వం వహించరాదని ఏ విధమైన ప్రలోభాలకు గురి కాకూడదని నిష్పక్షపాతమైనటువంటి ఉద్యోగ నిర్వహణ చేస్తూ ప్రజలకు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలాగా సహాయ సహకారాలు అందించాలని,
ఉద్యోగ నిర్వహణను గురించి విధివిధానాలను సిబ్బందికి గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని జిల్లా ఎస్పీ సెక్టర్ పోలీసు అధికారులకు తెలియ చేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎం జె వి భాస్కర రావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ బి.అది ప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
Mr. Bharath Reddy