హైదరాబాద్: 2024 నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ రవిగుప్తా.. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజల శాంతి, భద్రత మరియు శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేయడం ప్రాథమిక కర్తవ్యమని రవిగుప్తా అన్నారు. నూతన సంవత్సరంలో ఈ నిబద్ధతను బలోపేతం చేసేందుకు మరియు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. పౌరులందరి హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జీరో డ్రగ్ పాలసీ, ట్రాఫిక్ నిబంధనలు, నేరాల నివారణ, మహిళల భద్రత, సైబర్ నేరాల నిర్మూలనపై నూతన సంవత్సరంలో పోలీసు శాఖ దృష్టి సారిస్తుందని డీజీపీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో రాష్ట్రాన్ని మరింత భద్రంగా, శాంతియుతంగా తీర్చిదిద్దవచ్చని, ఇందులో అందరి పాత్ర కీలకమని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు ప్రతిష్టాత్మకంగా పాల్గొని సంబరాలను క్షేమంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2024వ సంవత్సరం అందరికీ ఆనందం, విజయం, ఆరోగ్యం మరియు శ్రేయస్సును అందించాలని ఆయన ఆకాంక్షించారు.
Our Citizen Reporter from Telangana
SANJEEV BHANDARI