అసెంబ్లీ ఎన్నికలకు 11వ సారి నామినేషన్ వేసిన జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి, గెలిచి ఆరు హామీలు అమలు చేస్తామంటూ ప్రజలకు బాండ్ పేపర్ రాశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బాండ్ ద్వారా హామీ ఇచ్చారు. ప్రజలకు అండగా ఉంటానని ప్రమాణం చేసి ఆలయంలో పూజలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా జగిత్యాలను జిల్లా కేంద్రం చేయలేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అభ్యర్థి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Our Citizen Reporter from Telangana

SANJEEV RAJESHAM BHANDARI